వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ కేంద్రంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ గాయత్రి రవి కుమార్ యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పట్టిన ప్రజలకు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నాగరాజు, వైస్ చైర్ పర్సన్ విజయ్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.