వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ఆత్మకూరు మండలం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జూరాల ఆయకట్టు రైతులకు సాగునీటిని విడుదల చేయాలని స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జూరాల ఆయకట్టు రైతులకు నీటి విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఆత్మకూరు మండల భారాస అధ్యక్షులు రవికుమార్ యాదవ్, కార్యకర్తలు పాల్గొన్నారు.