పదిలో శత శాతం ఫలితాలు సాధించాలని వనపర్తి జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్ యుగంధర్ అన్నారు. బుధవారం పెబ్బేరు జడ్పీ గర్ల్స్ హైస్కూల్ ను ఎంఈఓ జయరాములతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులు రెగ్యులర్ గా ప్రత్యేక తరగతులకు హాజరుకావాలని అన్నారు. పాఠశాలలో నిర్వహించే పరీక్షలను కచ్చితంగా రాయాలని సూచించారు.