కొత్తకోట: ధ్యాన మందిరంలోని శివలింగానికి నాగ హారతి

78చూసినవారు
కొత్తకోట మండలం కానాయపల్లి కోటిలింగేశ్వర దేవస్థానం ఆవరణలో నిర్మితమైన ధ్యాన మందిరంలో మంగళవారం ప్రదోషకాల పూజలు వైభవంగా నిర్వహించారు. పాదరస సహిత నవరత్నాలంకృత స్వర్ణ కవచ పంచలోహ శివలింగానికి ప్రదోషకాలంలో భక్తులు పంచామృతాలు, శుద్ధ జలాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అర్చకుల వేదమంత్రాల మధ్య నాగ హారతిని సమర్పించారు. భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్