కొత్తకోట మండలం కానాయపల్లి కోటిలింగేశ్వర దేవస్థానంలో మంగళవారం రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవగ్రహ మండపంలో గల సూర్యదేవునికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అర్చకుల వేదమంత్రాల భక్తులు మధ్య సూర్యదేవునికి క్షీరాభిషేకం చేసి ఎరుపు రంగు జలంతో, ఎర్రటి పుష్పాలతో పూజలు చేశారు. అనంతరం స్వామివారికి ధూప దీప నైవేద్యాలతో మహా మంగళహారతిని సమర్పించారు.