జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్ కు వనపర్తి జిల్లా కొత్తకోట కు చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థి మణికంఠ ఎంపికైనట్టు జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘని గురువారం తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల లో నిర్వహించిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో మణికంఠ ప్రదర్శన జాతీయస్థాయికి ఎంపికైనట్లు పేర్కొన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నుండి బహుమతి అందుకున్నట్లు చెప్పారు.