అహింసనే ఆయుధంగా చేసుకొని స్వాతంత్ర పోరాటాన్ని నిర్వహించిన మహాత్మా గాంధీ ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలని నేతలు అన్నారు. జయంతి వేడుకలను బుధవారం మండల కేంద్రంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఘనంగా నిర్వహించారు. చిన్న చింతకుంట మండలం సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి మాజీ ఎంపిటిసి వట్టెం శివ కుమార్, గ్రామ అధ్యక్షుడు అమరేష్, గ్రామ పెద్దలు నాయకులు పూలమాలు వేసి నివాళులర్పించారు.