పని చేసే వారికి ఎల్లప్పుడూ బీజేపీలో మంచి గుర్తింపు ఉంటుందని ఆ పార్టీ మహిళా మోర్చా వనపర్తి జిల్లా అధ్యక్షురాలు అశ్విని రాధా అన్నారు. పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షుడిగా రెండవసారి ఎన్నికైన డి. నారాయణను పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంతో పాటు పార్టీని మరింత బలోపేతం చేయడానికి ముందుండి పనిచేశారన్నారు.