వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అల్వాల గ్రామంలోని శ్రీ జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి గోశాలని, మండల బీజేపీ అధ్యక్షులు ముప్ఫురి చెన్నయ్య శనివారం ఉదయం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ గోశాల అభివృద్ధికై, గోవుల సంరక్షణకై బీజేపీ పార్టీ తరఫున కృషి చేస్తానని, గోశాల వ్యవస్థాపకుడైన రాములు యాదవ్ కి ముప్పూరి చెన్నయ్య హామీ ఇచ్చారు.