పాలమూరు జిల్లాలోనే ప్రముఖ ఆధ్యాత్మిక సాయి క్షేత్రమైన ఆత్మకూరు శ్రీ సాయిబాబా మందిరంలో ఈ నెల 16న మందిర రజతోత్సవాలు వేడుకగా నిర్వహిస్తున్నట్లు మందిర కమిటీ తెలిపింది. ఆరోజు ఉదయం పంచామృత అభిషేకాలు, విశేష పూజలు, లక్ష్మి గణపతి హోమం, అన్నదానం, సాయి భజన, పల్లకి సేవ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు , భక్తుల రద్దీకి తగిని ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సద్గురువుల కృపకు పాత్రులు. కావాలని కోరారు.