డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే కఠిన చర్యలుంటాయని సోమవారం కొత్తకోట సీఐ రాంబాబు హెచ్చరించారు. కొత్తకోట సర్కిల్ పరిధిలో నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని సీఐ సూచించారు. డిసెంబర్ 31 రాత్రి 9 గంటల నుండి బుధవారం తెల్లవారుజామున వరకు ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.