భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని టీజీ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సభ్యులు బండి అపర్ణ అన్నారు. వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయ క్రీడా మైదానంలో జిల్లా పోలీసులు నిర్వహిస్తున్న జన మైత్రి క్రీడలలో భాగంగా శనివారం ముగ్గుల పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కనుమరుగవుతున్న సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడానికి ఈ పోటీలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.