ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: వనపర్తి సిఐ

82చూసినవారు
వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వనపర్తి సీఐ కృష్ణ అన్నారు. శుక్రవారం వనపర్తి రూరల్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో వనపర్తి రూరల్ ఎస్సై జలంధర్ రెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ సురేంద్ర ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. నెంబర్ ప్లేట్ లేని 60 వాహనాలను సీజ్ చేసి జరిమానా విధించినట్లు సీఐ తెలిపారు. వాహనదారులు నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్