సంక్రాంతి పండుగకు సొంతూళ్ళకు వెళ్లే ప్రయాణికులతో వనపర్తి బస్టాండ్ కిటకిటలాడుతున్నది. సొంత వాహనాలు ఉన్నవారు శుక్రవారం నుండే స్వస్థలాలకు ప్రయాణమయ్యారు. పెద్ద సంఖ్యలో శనివారం ప్రజలు పల్లె బాట పట్టడంతో బస్సులు ఫుల్ అయ్యాయి. ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా స్పెషల్ బస్సులను నడుపుతున్నారు. పండుగకు స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్ లో తీవ్ర రద్దీ నెలకొన్నది.