వనపర్తిలోని టీఎన్జీవో సమావేశ భవనంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా మూడవ మహాసభలు ఘనంగా జరిగాయి. ఈ సమావేశంలో టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవపునయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటికొండ కృష్ణ ప్రసంగించారు. దేశంలో, రాష్ట్రంలో జర్నలిస్టుల స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతున్నాయని, జర్నలిస్టుల ఐక్యత ప్రశ్నార్థకంగా మారుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.