వనపర్తి జిల్లా ఆత్మకూర్ పట్టణ కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని ప్రతి ఒక్కరు పిలుపునిచ్చారు. అంబేద్కర్ అడుగుజాడలో ప్రతి ఒక్కరు నడవాలని సూచించారు.