వనపర్తి: అందరికీ సమాన హక్కులు కల్పించిన మహనీయుడు అంబేద్కర్

72చూసినవారు
వనపర్తి: అందరికీ సమాన హక్కులు కల్పించిన మహనీయుడు అంబేద్కర్
కుల మత వర్గాలకు అతీతంగా రాజ్యాంగం ద్వారా అందరికీ హక్కులు కల్పించిన మహనీయుడు Dr. బిఆర్ అంబేద్కర్ అని బిజెపి వనపర్తి జిల్లా అధ్యక్షుడు నారాయణ, పట్టణ మాజీ అధ్యక్షుడు బచ్చు రాము అన్నారు. సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా వనపర్తి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి బిజెపి శ్రేణులతో కలిసి పూలమాలవేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ బడుగుల అభ్యున్నతికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదని అన్నారు.

సంబంధిత పోస్ట్