రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కమలం జెండా ఎగురవేస్తామని బీజేపీ వనపర్తి పట్టణ మాజీ అధ్యక్షుడు బచ్చురాం శుక్రవారం అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా రెండవసారి ఎన్నికైన డి నారాయణను పార్టీ శ్రేణులతో కలిసి ఘనంగా సత్కరించారు. నారాయణ మాట్లాడుతూ పార్టీలోని ప్రతి ఒక్కరినీ కలుపుకొని కార్యక్రమాలు నిర్వహిస్తానని అన్నారు. పార్టీ ఆదేశాలు నాయకులు, కార్యకర్తలకు శిరోధార్యమని అన్నారు.