వనపర్తి బస్టాండ్ బయట ఏర్పాటు చేసిన ప్రచార బ్యానర్లు డ్రైవర్లకు, ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బందిగా మారాయి. బుధవారం జరిగిన ఒక సంఘటన బస్సు వెనుక వైపు కిటికీ రాడ్ల మధ్య ఒక బ్యానర్ కర్ర ఇరుక్కుపోయింది. అదృష్టవశాత్తూ కిటికీ పక్కన కూర్చున్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.