వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూరు స్టేజి సమీపంలో విద్యార్థులకు కాలేజీ, చుట్టూరా ఉన్న పారిశ్రమల నుంచి వచ్చే కార్మికులు ఉద్యోగులకు రోడ్డు దాటడం ప్రాణగండంగా మారిందని బీసీ పొలిటికల్ జెఎసి మండల అధ్యక్షుడు రమేష్ సాగర్ అన్నారు. జాతీయ రహదారి ప్రమాదకరంగా మారింది. నేషనల్ హైవే అథారిటీ యంత్రాంగం వెంటనే స్పందించి రోడ్డు ఇరువైపులా వాహనాల వేగాన్ని నియంత్రించే దిశగా బారికేడ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.