అవగాహనతోనే క్యాన్సర్ జయించవచ్చని వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి. రజని అన్నారు. సోమవారం అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా గోపాల్పేట్ పీహెచ్సీలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రజని మాట్లాడుతూ ముందస్తు నిర్ధారణ పరీక్షల ద్వారా క్యాన్సర్ నుంచి బయట పడవచ్చని అన్నారు. డిటెక్షన్- ప్రివెన్షన్- క్యూర్ అనే మూడు అంశాల ద్వారా క్యాన్సర్ను దూరం చేయవచ్చు అన్నారు.