వనపర్తి జిల్లా కేంద్రంలోని 21వ వార్డు దళితవాడలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ మీడియా కన్వీనర్ ద్యరపోగు వెంకటేష్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. వెంకటేష్ మాట్లాడుతూ రైతు భరోసా పథకం కింద ఎకరా లోపు ఉన్న వారికి 12000 రైతుల ఖాతాలో జమ్మచేయడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తుందని తెలిపారు.