తెలంగాణ ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీ జనాభా 51 శాతం ఉంటే 46 శాతానికి తగ్గించి చూపడం సరికాదని బీసీ పొలిటికల్ జేఏసీ మండల ప్రచార కార్యదర్శి మల్లేష్ గౌడ్ ఆరోపించారు. ఆదివారం ఆయన మండల కేంద్రంలో మాట్లాడుతూ 2014 సర్వేకు ఇప్పుడు చేసిన సర్వేకు బీసీ జనాభా తగ్గిందని వెంటనే ప్రభుత్వం సర్వేను పునః సమీక్షించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.