వనపర్తి: సేవల కోసం 15100 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించండి

85చూసినవారు
ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి వై. జానకి అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని బాలల సంక్షేమ సమితి కార్యాలయంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కక్షిదారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పేదలు మహిళలు, పిల్లలు, వృద్దులు రూ. 3 లక్షల సంవత్సర ఆదాయం ఉన్నవారికి ఉచిత న్యాయ సేవలు అందుతాయని అన్నారు. ఉచిత న్యాయ సేవల కోసం 15100 టోల్ ఫ్రీ నంబర్ ను సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్