టీటీడీ లో ఏ విధంగా అయితే నిరంతరం హరినామ సంకీర్తన జరుగుతున్నదో అదే విధంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ ఆలయంలో కూడా హరినామ సంకీర్తన కార్యక్రమం నిర్వహించాలని వనపర్తి భజన మండలి సభ్యుడు వెంకట్ రాములు డిమాండ్ చేశారు. అందుకు సంబంధించి మే 7న హైదరాబాదులోని ధర్నా చౌక్ లో నిర్వహించే ధర్నా కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను ఆదివారం వనపర్తి వెంకటేశ్వర స్వామి ఆలయంలో విడుదల చేశారు.