వనపర్తి: సమన్వయంతోనే నేరాల కట్టడి: ఎస్పీ

64చూసినవారు
సమాజంలో శాంతిని నెలకొల్పడంతో పాటు నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటుందని వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వార్షిక నివేదికను వెల్లడించారు. సమర్థవంతమైన నాయకత్వంతో జిల్లా పోలీసులు పని చేస్తున్నారని అన్నారు. నేరాలు తగ్గించేందుకు వివిధ రకాల చర్యలు అవగాహన కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు2538 కేసులు నమోదైనట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్