విద్యార్థులు సాంఘిక శాస్త్రంపై పట్టు సాధిస్తే భవిష్యత్తులో ఎలాంటి పోటీ పరీక్షలయిన సులభంగా ఎదుర్కోవచ్చని వనపర్తి జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్ యుగంధర్ అన్నారు. జిల్లా స్థాయి సాంఘిక శాస్త్ర ప్రతిభాపాటవ పరీక్షలను శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో నిర్వహించారు. పరీక్షా కేంద్రాన్ని వనపర్తి ఎంఈఓ మద్దిలేటితో కలిసి ఆయన పర్యవేక్షించారు.