వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ ఎస్సీ బాలుర కళాశాల(బి) వసతి గృహంలో వసతి గృహ సంక్షేమ అధికారి పసుల సత్యనారాయణ యాదవ్ గురువారం రాత్రి వసతి గృహ సంక్షేమ అధికారి హాస్టల్లో నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. వసతి గృహ విద్యార్థులతో అందుతున్న వసతులు మిగతా అంశాలను అడిగి తెలుసుకుంటూ కొంతమంది మహనీయుల జీవిత చరిత్ర, తల్లిదండ్రుల పాత్ర, లక్ష్యాల ఎంపిక అంశాల గురించి వివరించారు.