2025 నూతన సంవత్సరంలో వనపర్తి జిల్లా అభివృద్ధికి సమన్వయంతో కలిసికట్టుగా పని చేయాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గాంగ్వార్ సూచించారు. వనపర్తి డిసిసి అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్ శనివారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా ప్రజలకు అందించాలని అన్నారు.