భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏటా రూ. 12వేల సహాయాన్ని లబ్ధిదారుల ఎంపికలో మున్సిపాలిటీలో జీవిస్తున్న వ్యవసాయ కూలీలకు అన్యాయం జరుగుతుందని సీపీఐ వనపర్తి జిల్లా కార్యదర్శి కె విజయ రాములు విమర్శించారు. గురువారం వనపర్తి లోని పార్టీ ఆఫీసులో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మున్సిపాలిటీలో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయటం లేదన్నారు.