వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామ చెరువు అకాల వర్షానికి చెరువు గండిపడి పూర్తి స్థాయిలో నీటి నిల్వ లేకుండా ఉండటంలో రైతుల ఇబ్బందులు పడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఊరు చెరువు మరమ్మతులకు రూ. 76 లక్షలు మంజూరు చేయించిన ఎమ్మెల్యే తుడి మేఘ రెడ్డికి దొడగుంటపల్లి గ్రామం తరపున రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు.