విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు, పాఠశాల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వనపర్తి డీఈవో అబ్దుల్ ఘని తెలిపారు. వనపర్తి మండలం చిట్యాల ప్రైమరీ స్కూల్ లో శుక్రవారం నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ స్కూల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన పాఠశాల పట్ల విద్యార్థులకు ఆసక్తి పెరుగుతుందన్నారు.