దివ్యాంగ పిల్లల్లో సామర్థ్యాలను పెంచేందుకు భవిత కేంద్రాలు ఎంతగానో తోడ్పడతాయని శుక్రవారం వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి V. రజని అన్నారు. యాదమ్మ తన కూతురు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని న్యాయ సేవాధికార సంస్థను కోరగా వి. రజని స్పందించి బాలికను భవిత కేంద్రంలో అడ్మిషన్ ఇప్పించారు. వి. రజని మాట్లాడుతూ భవిత కేంద్రాలలో ఇచ్చే శిక్షణతో దివ్యాంగ పిల్లల్లో ఆరోగ్యం మెరుగుపడుతుందని అన్నారు