జిల్లా ఉపాధి, శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో వనపర్తిలోని ప్రధానమంత్రి కౌశల్ కేంద్రంలో సోమవారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాలో 730 ఉద్యోగాల కోసం 6 కంపెనీల నుండి H. R మేనేజర్లు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించారు. నిరుద్యోగ యువతీ, యువకులు ఈ ఇంటర్వ్యూకు హాజరై నచ్చిన ఉద్యోగాలకు ఓకే చెప్పడంతో ఆయా కంపెనీల వారు వారికి ఆఫర్ లెటర్ ను కూడా అందజేశారు. జిల్లా ఉపాధి, శిక్షణ అధికారి నేతృత్వంలో ఈ జాబ్ మేళా నిర్వహించారు.