వనపర్తి జిల్లా పరిధిలో చైనా మాంజపై నిషేధం విధించడం జరిగిందని, జిల్లాలో ఎవరైనా చైనా మాంజ విక్రయించిన, వినియోగించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శుక్రవారం జిల్లా ఎస్పీ గిరిధర్ హెచ్చరించారు. జిల్లాలో
చైనా మాంజ విక్రయించే దుకాణాలపై తనిఖీలు నిర్వహిస్తామని అన్నారు. చైనా మాంజతో పక్షులు, ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని మాంజాను అమ్మితే 7 ఏళ్ల జైలు, రూ. 10 వేల జరిమానా విధిస్తామన్నారు.