వనపర్తి పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారికి నిమ్మకాయలతో విశేష అలంకరణ జరగింది. ఈ విషయాన్ని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బచ్చు రాము తెలిపారు. ఈ అలంకరణ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రులు అయ్యారని ఆయన చెప్పారు. నిమ్మకాయల అలంకరణ అనంతరం అమ్మవారికి అర్చన కూడా జరిగిందని ఆయన తెలియజేశారు.