బాలల చట్టాలపై, హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి. రజని అన్నారు. గురువారం వనపర్తి మండలం చిట్యాల జడ్పీ హైస్కూల్ లో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. రజని మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించుకోవడానికి, న్యాయం కోసం పోరాడటానికి చట్టాలపై అవగాహన అవసరమని అన్నారు. విద్యార్థి దశ నుంచే మంచి ప్రవర్తన కలిగి జీవిత లక్ష్యాలను సాధించాలన్నారు.