తెలంగాణలో బీజేపీకి ఆదరణ పెరుగుతున్నదని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాలలో జెండా ఎగురవేయాలని మాజీ ఎమ్మెల్యే ఎన్వీ ఎస్ ప్రభాకర్ అన్నారు. శుక్రవారం వనపర్తిలో నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు, బూత్ కమిటీల నియామకంపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్న ప్రజల మనోగతాన్ని గౌరవిస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత నాయకులదేనన్నారు.