ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ కు వ్యతిరేకంగా కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు సీఐటీయు ఆధ్వర్యంలో వనపర్తి ఆర్టీసీ డిపో సమీపంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సీఐటీయు జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు వ్యతిరేకిస్తూ కేంద్ర బడ్జెట్ ను సవరించాలని డిమాండ్ చేశారు.