వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి. రజని గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలో ఉన్న పునరావాస కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని మానసిక వికలాంగులతో ఆమె మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు. అనంతరం జాతీయ ఆరోగ్య మిషన్ ను సందర్శించి వారి అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు పోషక ఆహారం అందించాలని నిర్వాహకులకు ఆమె సూచించారు. ఉత్తరయ్య, నాగరత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.