సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని వనపర్తి జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులు డిమాండ్ చేశారు. వనపర్తి కలెక్టరేట్ ఎదురుగా సమగ్ర ఉద్యోగులు చేపడుతున్న నిరసన దీక్ష గురువారానికి 24వ రోజుకు చేరింది. సమగ్ర శిక్ష ఉద్యోగులు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్ల సాధన కొరకు 24 రోజులుగా నిరసనలు, సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, మొండి వైఖరిని ప్రదర్శిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.