వనపర్తి: సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలి

63చూసినవారు
సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని వనపర్తి జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులు డిమాండ్ చేశారు. వనపర్తి కలెక్టరేట్ ఎదురుగా చేపడుతున్న నిరసన దీక్షలు సోమవారం నాటికి 22వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యా శాఖలో పనిచేస్తున్న తమకు మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు అమలు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్