ప్రవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వనపర్తి జిల్లా బీసీ విద్యార్థి సంఘం నాయకుడు హేమవర్ధన్ నాయుడు అన్నారు. వనపర్తిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ పిల్లలను బాగా చదివించాలనే పేద ప్రజల ఆశలను, ఆసరగా చేసుకున్న పాఠశాలల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తూ డబ్బుల దండుకుంటున్నారు. తక్షణమే ఆయా పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలన్నారు.