శ్రీరామ కోటి రాజు పంపినటువంటి భద్రాచల సీతారాముల తలంబ్రాలు, కండువాను శనివారం వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ కి శ్రీ వాసవి సేవా సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ పూరి సురేష్ శెట్టి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భద్రాచల సీతారాముల కళ్యాణం, వస్త్రములు అందించినందుకు పూరి సురేష్ శెట్టికి అభినందనలు తెలియజేస్తూ ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు.