వనపర్తి జిల్లా కేంద్రంలో రహదారుల విస్తరణకు సంబంధించి పెండింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో రెవెన్యూ, మున్సిపల్, ఆర్ అండ్ బి శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో రహదారుల విస్తరణకు సంబంధించి పెండింగ్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.