పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే వారికి న్యాయం చేయడానికి చట్టాలు ఉన్నాయని మహిళా సాధికారత కేంద్రం జిల్లా జెండర్ స్పెషలిస్టులు శ్రీవాణి, సలోమిలు అన్నారు. సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం వనపర్తి బస్సు డిపోలో పని చేసే సిబ్బందికి పోష్ యాక్ట్-2013 పై అవగాహన కల్పించారు. శ్రీవాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్త్రీల సంరక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్నదని అన్నారు.