విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని వనపర్తి పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సురేంద్ర అన్నారు. శనివారం వనపర్తి పట్టణంలోని రాజీవ్ చౌక్ లో వివిధ పాఠశాలల విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రాణం ఎంతో విలువైందని బాధ్యత రాహిత్యంతో నడుపుతూ ప్రాణాల మీదుకు తెచ్చుకోవద్దని సూచించారు.