వనపర్తి: భరోసా కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలి

61చూసినవారు
మానసిక శారీరక వేధింపులకు గురయ్యే వారికి భరోసా కేంద్రం తక్షణ సహాయం అందిస్తుందని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని భరోసా కేంద్రం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఆయన జిల్లా ఎస్పీ గిరిధర్ తో కలిసి కేంద్రాన్ని సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ లైంగిక దాడులకు గురైన మహిళలు యువతులు భరోసా కేంద్రం సేవలను వినియోగించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్