సమాజంలోనే ప్రజలందరికీ మెరుగైన న్యాయ సేవలు అందించడమే న్యాయ సేవాధికార సంస్థ లక్ష్యం అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎంఆర్ సునీత అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పారా లీగల్ వాలంటీర్సల శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.