సమాచార హక్కు చట్టం సామాన్యుడి చేతిలో వజ్రాయుధం లాంటిదని జి. రవికుమార్ అన్నారు. సమాచార హక్కు చట్టం ఆక్టీవిస్ట్స్ ఫోరమ్ వనపర్తి జిల్లా నూతన అధ్యక్షులుగా మదనాపురం మండలానికి చెందిన జి. రవికుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల గణేష్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులై. రవికుమార్ మాట్లాడుతూ ప్రతి సామాన్యుడుకి సమాచార హక్కు చట్టం ఒక బ్రహ్మాస్త్రం అన్నారు.